ఒక తనువు
ఒక తనువు
ఒకే తనువులో రెండు భావాలు ఇమిడి ఉన్నాయి
ఒకటి అలజడి మరొకటి మౌనస్థ ఉగ్రగా ఉన్నాయి
ఒకటి బాధతో శరీరాన్ని అతలా కుతలం చేస్తూ
మరొకటి గతజ్ఞాపకాల నీడలను నిత్యంతోడేస్తూ
ఇది మనకు ఎప్పటికీ అర్థం కాని జీవిత సత్యం
ఒకటి ప్రశాంత మదిలో దూరి మనసు విరిచేస్తూ
మరొకటి అస్థిర అనాలోచనలపు సంసారంచేస్తూ
చింతల జీవితంలో వింతలే వింతగా సృష్టిస్తూ
చిత్ర జీవితం కొంత అందంగా కొంత వికారంగా చేస్తూ
జీవితాన్ని దగ్గరగా ఆస్వాదించాలి ఎందుకంటే
జీవితానుభవ పాఠాలే నేర్చుకుంటే దేనికీ కొరగారు
జీవిత పాఠాలు చదవకుంటే నీ చదువు నిరర్థకమే
జీవితం నీకొక గుణపాఠం దీనినిఎవరూమార్చలేరు
ఎవ్వరూ నీకు నేర్పలేరు.... నేస్తం...!!

