నయనాలు
నయనాలు


ప||
కవ్వించి కనువిందులూ చేసే ఆ కళ్ళు
నవ్వించే అందమైన ఊహల లోగిళ్ళు |2|
చ||
కనురెప్పలు మూసి కల్పనే చేరే కలలై
మనసు రెక్కలే విరిసెనులే పూమాలలై |2|
ఎక్కడో పూచిన వెన్నెల విరిసినే ఇక్కడే
తోడుగ సాగినే చందమామ తానొక్కడే |ప|
చ||
కొత్త లోకం సరికొత్త ఊహలే సమీపించే
చిత్తమంత వలపు చినుకులే చిలకరించే |2|
కోరికకే కారకమాయేగ కలకంఠి వీక్షణం
ఉరికే ఎదలో నిలిచే ఆస్మరణే ప్రతీక్షణం |ప|
చ||
ఎదుట నిలిచిన ఎరుకనే మరచే మనసు
వలపు వగపు వదలక వెంటాడే ధనుస్సు |2|
పగలు రేయి వేటాడెగ తననే ఆ కాంక్షలు
కూరిమే కూడేసి ఇకచెప్పు శుభాకాంక్షలు |ప|