నవశక నిర్మాణం జాతికి సోపానం
నవశక నిర్మాణం జాతికి సోపానం
సహనం హద్దులు దాటిన వేళ
ఆవేశం సంకెళ్లు తెంచుకున్న వేళ
అభిమానం, ఆదరణ కోల్పోయిన వేళ
అనుబంధాల సుమాలు రాలిపోతున్న వేళ
ఆనందం అంతరించిపోతున్న వేళ
ఆప్తులే అవరోధాలై నిలిచిన వేళ
కాసుల కోసం కన్నవారిని కడతేర్చే వేళ
ఒకరి బాధలు ఇంకొకరి సుఖానికి కారణంగా మారుతున్న వేళ
కాలం చేతిలో కీలుబొమ్మలైన సోదరీ సోదరులారా
పలుకుదాం నవశకానికి స్వాగతం
చేద్దాం ఈ ఆలోచనా ధోరణిని అంతం
