STORYMIRROR

Midhun babu

Romance Fantasy Inspirational

4  

Midhun babu

Romance Fantasy Inspirational

నవరగం

నవరగం

1 min
4


చూపులతో ప్రియజాబిలి..పాడిందొక నవరాగం..!

అరవిరిసిన నెలవంకై..విసిరిందొక నవహాసం..! 


పలుకుతేనె ధారలలో..సౌదామిని తానేలే.. 

మదినేలే పరిమళమై..నింపిందొక నవభావం..! 


కవనారుణ తేజానికి..నిత్యదీప సుందరియే.. 

అంతరంగ నాట్యానికి..పొదిగిందొక నవతాళం..!


అనుభవాల తెఱచాటున..దివ్యశక్తి రూపసియే.. 

కలలు నిజం చేసేందుకు..నిలిపిందొక నవరాత్రం..! 


పొగడగాను భాషలేని..లిపియెలేని సొగసరియే.. 

బీజాక్షర సాక్షిగాను..చూపిందొక నవగాత్రం..! 


ఒక లేఖను వ్రాయలేని..తనమేగా అసలుప్రేమ.. 

చూపరాని చిత్రకథను..చేసిందొక నవకావ్యం..! 


Rate this content
Log in

Similar telugu poem from Romance