నువ్వుంటే ప్రేమెంతో
నువ్వుంటే ప్రేమెంతో
నువ్వంటే ప్రేమెంతో..తెలియదోయి ఏం తెలుపను..!?
నినుచూడక ఈప్రాణం..ఆగదోయి ఏం పాడను..!?
కలలెందుకు కనవలెనట..ఉంటినిగా నీ కలలో..
తీపివెర్రి విరహమేదొ..అంటదోయి ఏం చెప్పను..!?
నీ తలపుల వెన్నెలెంత..మత్తులోన ముంచేనో..
బయటపడే ఆశన్నది..ఉండదోయి ఏం పలుకను..!?
భాషలెల్ల సిగ్గుపడుట..కన్నులార చూచుచుంటి..
నినుపొగడే సంగతేమొ..పట్టదోయి ఏం వ్రాయను..!?
లీలలెన్ని చూపేవో..ఎంత మాయ చేసేవో..
ఈ'నేను'కు ఎఱుకన్నదె..కలగదోయి ఏం చేయను..!?
కరిగిపోవు కాలమెలా..ఉంటుందో ఏమోమరి..
నీపదముల సాక్షిగాక..వెలగదోయి ఏం నవ్వను..!?

