నువ్వు
నువ్వు
పువ్వు మాదిరి నవ్వకుంటే దళంగానే ఉండిపో నువు..!
నిన్ను నువ్వే మార్చుకుంటూ మరాళంగా ఉండిపో నువు...
చూటు చీకటి ఆవరించిన స్నేహ దీపం వెలుగు చాలూ...!
నిన్ను నువ్వే తిట్టు కొనకా తెలివిగానే మరచిపో నువు
యెదను కాల్చే చిచ్చు రేగెను..అశ్రుధారలు కురసి ఆపులె!
వేదనెంతో చితిని పేర్చగ సంతసమ్మే చేర్చిపో నువు.
మనసు కాగిత పడవలోనా తిరుగుతూ నువు వడలిపోకూ...
ధైర్యమనియెడి కవచమొకటీ కప్పుకుంటూ సాగిపో నువు..!
రాళ్ల దెబ్బలు తిన్న వృక్షము మధుర ఫలముల నీయచూచును..!
.పడినవాడే మంచివాడని ధర్మమూర్తిగ వెళ్ళిపో నువు..

