నువ్వు రువ్విన గువ్వలే కాబోలు
నువ్వు రువ్విన గువ్వలే కాబోలు


నీ చూపు సోకిన శూన్యమే కాబోలు
కవి కాళిదాసులా కలము పట్టేను
నిను తాకి వచ్చిన చిరుగాలి కాబోలు
నా ముందు గొప్పగా ఈలలేసేను
నీ కాలికంటిన ధూళియే కాబోలు
పరువాల కన్యలై నాట్యమాడేను
నీ నుదుట పట్టిన చెమటయే కాబోలు
అత్తరు పన్నీరులై పరిమళించేను
నీ రూపు రేఖల చిత్రమే కాబోలు
శృంగార శిల్పమై మెరుపు లీనేను
నీ నోట మాటల మూటలే కాబోలు
నా చెవులలో ముత్యాల సవ్వడయ్యేను
నీ నవ్వు రువ్విన గవ్వలే కాబోలు
నా హృదయ గూటిలో గువ్వలయ్యేను
నీ తలపు వలపుల తలుపులే కాబోలు
నా గుండె స్పందనై నన్ను నిలిపేను
నీ ఊహ గీసిన రేఖలే కాబోలు
నా మదిని మురిపింప లేఖలై వచ్చెను
ఏ జన్మ బంధమో నీధ్యాసే నా శ్వాస
కరుణించి వెళ్లుమా ఓ చెలియ నువ్వు
జీవించి వుండనా నీ జ్ఞాపకాలుగా