STORYMIRROR

T. s.

Classics Fantasy

4  

T. s.

Classics Fantasy

నువ్వు నేను మనమైపోవాలి

నువ్వు నేను మనమైపోవాలి

1 min
280


ఒక చూపు కావాలి అది నీ కళ్ళదై ఉండాలి

ఒక నవ్వు కావాలి అది నీ పెదవుల మీద పూయాలి

ఒక పిలుపు కావాలి అది నా నువ్వే పలకాలి

ఒక ప్రేమ కావాలి అది నీ మనసు నుంచి రావాలి

మొత్తంగా నేను నీ నువ్వైపోవాలి

నువ్వు నా నువ్వైపోవాలి

నీకు నేనుగా నాకు నువ్వుగా

నాకు నువ్వు కావాలి నీతోడు కావాలి

నీ నవ్వు కావాలి నీ వలపు పిలుపు కావాలి

నీ ప్రేమ కావాలి నేనే నీ ప్రేమనైపోవాలి

నీ హృదయం నా హృదయం పరితపించిపోవాలి

నీ సొగసు నా సోయగం చేరువైపోవాలి

నా నువ్వు నీ నేను మమేకమైపోవాలి

నీ శ్వాస నా శ్వాస కలిసిపోవాలి

నేనే నువ్వుగా నువ్వే నేనుగా ఏకమైపోవాలి

నువ్వు నేను మనం మనమైపోవాలి....



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics