నువ్వు నేను ఏకమై
నువ్వు నేను ఏకమై
నీ మాటల మంత్రాలతో ఎదో మాయచేసి
నా మనసుని దోచేసావు…
నీ చూపుల బాణాలతో గాలం వేసి మనసంతా నిండిపోయి
నా గుండెచప్పుడు నువ్వయ్యావు…
నీ రాకతో నాలో వసంతాలు పూయించి
నా అణువణువు ఆక్రమించి నా ప్రాణమే నీవయ్యావు…
నా నీడగా నువ్వు మారి నీ వెన్నంటి నేనుండి
నా ధ్యాస నీవై.. నీ శ్వాస నేనై నా ఆశ నీవై.. నీ ఆత్మ నేనై…
నువ్వు నేను ఏకమై రెక్కల హరివిల్లునెక్కి
చేరిపోదామా మరో ప్రపంచంలోకి…
... సిరి ✍️❤️

