STORYMIRROR

Dinakar Reddy

Abstract Romance

4  

Dinakar Reddy

Abstract Romance

నువ్వు కనిపిస్తుంటే

నువ్వు కనిపిస్తుంటే

1 min
525

ఏదో గుండె దడ

ఎక్కడో తాకినట్టుగా గాలి

ఒళ్లంతా బరువుగా తూలి

నీ మీద పడిపొమ్మంటుంది

నీతో కూడి పండిపొమ్మంటుంది


ఏం కళ్ళు అవి

నన్ను వేటాడేందుకు చూసినట్టు

నా మనసు వేడెక్కించేట్టు

నా పెదాలు తడారిపోయేట్లు

నా బ్రహ్మచర్యాన్ని తూట్లు పొడిచేట్టు


ఇంకా కోపమా

వేడెక్కిన పాల మీద నీళ్ళు చల్లినట్లు

నా తనువును సముదాయిస్తున్నా

హత్తుకుని నన్ను గెలుచుకోవా

ఆ నీ ఎత్తుగడలకు నే దాసోహమైపోనా


నువ్వు కనిపిస్తుంటే

నేను విరహాగ్ని జ్వాలనయినా



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract