నువ్వేంతో ప్రియామైన దానివి
నువ్వేంతో ప్రియామైన దానివి
ఒకానొక వసంత కాలపు రోజున..
నీ మీది ప్రేమ ఉప్పొంగిన క్షణాల్లో..
నా ఇంటి పెరట్లో చీకటి పరుచుకున్న సాయంకాలంలో..
వెదచల్లబడిన సూర్య కాంతిని చూసాను! అక్కడ..
అంధకారంలో నిలబడి ప్రణయాగ్ని వైపుగా మంద్రమైన
గొంతుతో నువ్వు నన్ను పిలిచావు.
అచ్చం ఒక అడవి పుష్పంలా ఎంత వింతగా నవ్వావని?
ఉజ్వలంగా మెరిసిపోయే వెలుగులో నా ముందు నిలబడ్డావు..
నీలాంటి మనిషిని కేవలం చీకట్లలోంచి నడిచిన మనిషి
మాత్రమే తయారు చేయగలడు!
అసలు నీ గురుంచి ఆలోచించే క్షణాలు ఎంత మధురమైనవని
ఎలా చెప్పను..
నువ్వు నాకెంతో ప్రియమైన దానివని! నిజం..
నువ్వు నాకు చాలా.. ప్రియాతి ప్రియమైన దానివి

