నువ్వే నా ప్రపంచం
నువ్వే నా ప్రపంచం
కాసేపైనా మదిలో నీ ఊహలే లేనీ
క్షణాలంటూ ఉన్నాయా
అసలు అలాంటి క్షణాలంటూ ఉంటాయా'
నిన్నంటూ నే తలచుకోని
రోజులు ఉన్నాయా
అసలు అటువంటి రోజంటూ ఉంటుందా
నీవంటూ నాతోలేని
ఒంటరితనాలు ఉన్నాయా అసలు నువు నాతోలేని
ఒంటరితనమంటూ ఉంటుందా
ఏం చేస్తున్నా
ఎటు చూస్తున్నా
ఎటు వెళుతున్నా. ప్రతీదానిలో నే
నీ రూపే చూస్తున్నా
ప్రతీ పిలుపులో నీ పేరే వింటున్నా
నువ్వే నా ప్రపంచమంటున్నా..

