STORYMIRROR

Midhun babu

Abstract Classics Others

4  

Midhun babu

Abstract Classics Others

నరక చతుర్దశి

నరక చతుర్దశి

1 min
343

ధైర్యమనే 'సత్య'రూపును చూపించింది దీపావళి,

అమావాస్య వేళ ధరణిని 

దీపకాంతుల వెలుగులతో నింపింది దీపావళి,

నరకాసుర వధతో మగువశక్తిని మహికి చూపింది దీపావళి.


ఐహికంలో సాగిపోవు జీవరథంకు 

పవిత్ర ఆధ్యాత్మిక బాటను

తెలియచేసింది దీపావళి,

విజయలక్ష్మీకి మంగళహారతులిస్తూ ప్రతిఇల్లు ఆహ్వానం పలికేలా చేసింది దీపావళి,

దుఃఖాలేలేని నవ్వులతో ప్రతిలోగిలి విలసిల్లాలని

ధనలక్ష్మీకి స్వాగతం పలుకుతుంది దీపావళి,

పరిమళ బంధాల హృదిదేవతగా

మనసుకలతలు తీర్చి

శాంతి సౌఖ్యం పంచుతుంది దీపావళి.


టపాసుల శబ్దాలతో విజయోత్సవపు వేడుకలు జరుపుతుంది దీపావళి,

వెలుగుల రంగుల హొయలతో తరగని మధువులు పంచుతుంది దీపావళి,

భక్తిసుధల పవిత్రనోములతో

జగతికి ఆత్మశక్తిని పెంచుతుంది దీపావళి,

శుభములు విజయముల

సర్వసంపదల నిధులతో

అవనిని ఆనందమయం చేయగా వచ్చింది దీపావళి.


Rate this content
Log in

Similar telugu poem from Abstract