STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

నిశ్శబ్ధం

నిశ్శబ్ధం

1 min
246


విరిగిన మనసులో సుళ్ళు

తిరిగే జ్ఞాపకాల శకలాలు

అలసిన హృదిలో వాడిన ఆశలు

కలల పంటలన్ని కన్నీటి వరదలో

కట్టగట్టుకుని కలిసిపోయాయి


మదిలో పెంచుకున్న మమతల

పూలతలు పలకరింపుల నీరులేక

వడలి వాలి కలతప్పిబోరుమంటున్నాయి

నిశ్శబ్దాలన్నినీకునాకు మధ్య 

నీడల్లా మారిపహారా కాస్తున్నాయి

క్షణాలు కత్తుల్లా కాలాన్ని కోస్తూ

విభజిస్తూ గతపు ఖాతాలో వేస్తున్నాయి

 ఖాళీ అయిన బుట్టలా

అలా ఓమూల పడ్డట్టు మనసు ముడుచుకొని

నిరాశ దుప్పటి కప్పేసింది

నీకోసం ఎదురు చూసే చూపులకు సెలవిస్తూ


నేరం చేయకనే దోషినయ్యాను

చేయని తప్పుకు శిక్షింపబడ్డ ఖైదీ నయ్యాను

మది నీకు మమతల మందిరం చేయడమేనానేరమా

మరచిపోని జ్ఞాపకాల పందిరై అల్లుకోవడమే నా దోషమా

నా హృది ఘోషను తెలియజెప్పే దారేది

ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టేదెవరు??

అపార్ధపుమనసులమౌన భారాలనుదింపేదెవరు


Rate this content
Log in

Similar telugu poem from Inspirational