నిశీధిలా
నిశీధిలా
మౌనమే వీడినా...
మాటకే కరువు...
కన్నీరు కరిగినా...
కలల్లోకే అడుగు...
వర్షం కురిసినా...
వెలిసిన హరివిల్లే ఆశలు...
నిజం తెలిసినా...
విలువలకే సంకెళ్లు..
అందుకే రేపటికొసం ఎదురుచూపులు...
అయినా అనుక్షణం...
గుచ్చుతున్నాయి నీ జ్ఞాపకాలు...
ఎదను తీపిముళ్లలా...
పిండేస్తున్నాయి నీ నవ్వులు...
నిశ్శబ్ద నిశీధిలా...
... సిరి ✍️❤️

