నిర్వేదం
నిర్వేదం
చుట్టేయును మదిపిండును..చూపలేని నిర్వేదం..!
మరిరాలని ఆశవలన..మోయలేని నిర్వేదం..!
వర్ణించగ భాషలేవి..చాలవులే ఎవరికైన..
ప్రేమవిలువ తెలియకనే..పట్టలేని నిర్వేదం..!
పరితాపము తీరుదారి..వెతుకులాడు వారెవరో..
జ్ఞానమింత పొందేందుకు..అణచలేని నిర్వేదం..!
ఏది శాంతి సుఖమదెచట..మనిషికింత లోకంలో..
ప్రశ్నించే మనసులోనె..ఓపలేని నిర్వేదం..!
ఎవరికొరకు వారుగాక..జగతిగూర్చి చింతనేది..
కరుణ మూలమందజూడ..చెప్పలేని నిర్వేదం..!
బుద్ధత్వపు లోగిలిలో..చేరి నిలచుటవసరమే..
నిత్యముక్తి స్థితినందగ..నిలువలేని నిర్వేదం..!

