నిన్ను చూసిన క్షణం
నిన్ను చూసిన క్షణం
"ఓయ్ పొట్టి"..........!!!!!
నిన్ను చూసిన క్షణం నుంచి..!!
రాలే మంచుబిందువుల్ని చూస్తే నువ్వే గుర్తుకొస్తావ్..!!
బహుశా నీ మనసు కూడా అంత స్వచ్ఛంగా ఉంటుందేమో..!!
విరిసే పువ్వులను చూసినా నువ్వే గుర్తుకొస్తావ్..!!
మధురమైన మాటలతో మనసుపై
మకరందం వొలుకు తున్నట్లుగా..!!
కోవెలలో దీపం చూసినా నువ్వే గుర్తొస్తావ్
వెలుగు పంచె నవ్వులు నీ సొంతం కనుక..!!
అందుకేనేమో ఆతృతగా నాహృదయం ఎదురు చూస్తోంది ఆ నవ్వుల వెలుగులో
నన్ను నడిపిస్తావని..!!
నీ కోసం.. !!
మధురమైన నీ పలకరింపు కోసం..!!
నీ చిరునవ్వుల వెలుగు కోసం ..!!
నా జీవితంలో కరిగే కాలంలో ప్రతి క్షణం నీకోసం ఎదురుచూస్తుంటా ........!!!!!!

