STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నిజం కాని కల

నిజం కాని కల

1 min
274

మంచు పూల గుండెల్లో మకరందం కాను నేను

 రాతి గుండె లోతుల్లో స్పందించని శిలను నేను 


రాయంచల సందేశం నాకెందుకు పంపుతావు

నీ హృదయపు రాణివాస ప్రియసఖినై రాను నేను…


 శిధిలమైన జ్ఞాపకాల చివరి పేజి రాస్తున్నా 

 బరువెక్కిన రెప్ప వెనక నిజంకాని కలను నేను


 ఘోషించే సాగరాల విషాదాల్ని మోస్తున్నా 

 తీరాలను చేరలేక ఉప్పొంగే అలను నేను


 నీ లోపలి సగం కాను నా లోపల నేను లేను

 సత్య కంటి చెమ్మలుగా మిగిలిపోవు కథను నేను…


Rate this content
Log in

Similar telugu poem from Romance