నీవు -నన్ను
నీవు -నన్ను
'నీవు-నన్ను' చూస్తున్నది..తెలియకనే బాధలన్ని..!
నాలోపలి 'నిన్ను-నేను'..చూడకనే బాధలన్ని..!
పూలగాలిలోని మధువు..సేవించే పనేమిటో..
వసంతాల వేడుకనే..వీడకనే బాధలన్ని..!
కనిపించని పట్టుదార..మీమోహం ఎంతవింత..
కనుపాపల మనసుపట్టు..రాలకనే బాధలన్ని..!
నరకమునే స్వర్గముగా..భావించే తెలివేమిటొ..
జ్ఞానానికి పెద్దపీట..వేయకనే బాధలన్ని..!
మరణపు ఉనికిని చెరిపే..మహోదయం జరిగేనా..
మౌనపు వెన్నెల నిధిలో..చేరకనే బాధలన్ని..!
చినుకూ గింజల పెండ్లికి..భజంత్రీల మైనామే..
పాత్ర ఎఱుక జన్మలుగా..పొందకనే బాధలన్ని..!
