నీవు -నేను
నీవు -నేను
నిన్నుగూర్చి తెలియకనే..మోజుపడితి వర్ణించగ..!
నిను చూస్తూ ఉండలేని..ఈ మనసే ఊరించగ..!
అన్నిట అంతట నీవే..మాటలకందని చెలియా..
ఏవో పదముల అల్లిక..ఉద్వేగము పండించగ..!
గొప్పపేరు కావాలని..రావాలని ఉబలాటం..
పలురంగుల కిరీటాల..గొడవేదో కవ్వించగ..!
నీ సొగసుల సోయగాల..వెనుకేనా పరుగులన్ని..
జవాబేదొ తెలిసికూడ..ఏమున్నది సాధించగ..!
సత్యమెంత సుస్పష్టమొ..మట్టిబొమ్మ నిజసాక్షిరొ..
ప్రాణదీప కథనమునే..ఒక పాటగ పలికించగ..!
అక్షరాల చిత్రాలకు..అనుభూతియె శిల్పముగా..
అనుభవాల సారమేదొ..నీ దయతో వర్షించగ..!

