STORYMIRROR

Midhun babu

Classics Fantasy Children

3  

Midhun babu

Classics Fantasy Children

నీవు నడుచు దారంతా

నీవు నడుచు దారంతా

1 min
2


నీవు నడచు దారంతా..కర్పూరం పండాలోయ్..! 

నినుమెచ్చగ నేనెవ్వరు..నీ ఆత్మయె మెచ్చాలోయ్..! 


ఎవ్వరిపై ఏ కత్తులు..విసరాలట ఎందుకసలు.. 

మాటల మల్లెలు చల్లే..మౌనంతో ఉండాలోయ్..! 


పూసిన గంధపు వాసన..ఎంతసేపు ఉంటుందట.. 

తరగని కరుణాలయమది..నీ హృదయమె తెఱవాలోయ్..! 


నిజాయితీ నీకు గొడుగు..పడితేనే నాయకుడవు.. 

శ్రమకు తగిన విలువనిచ్చు..గుణంతోడు కావాలోయ్..! 


ఎన్నికోట్లు ఎచటదాచి..ఎవరు పట్టుకెళ్ళగలరు.. 

అర్థరహిత స్వార్థానికి..సమాధినే కట్టాలోయ్..! 


మూడునాళ్ళ ముచ్చట ఇది..బతుకు వింత నాటకమే.. 

వివేకమే ఆయుధముగ..బుద్ధిపదును ఎక్కాలోయ్..! 




Rate this content
Log in

Similar telugu poem from Classics