STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

నీవు కంటే పడగానే

నీవు కంటే పడగానే

1 min
10

నీవు కంట పడగానే..చెలిగ మారి పోయానా..!

నన్ను నేను తెలియకనే..మనసు ఇచ్చివేశానా..! 


ప్రేమమధువు ఒంపకలా..త్రాగలేను ఒకేసారి.. 

కదలలేక పోతున్నా..వలను చిక్కుకున్నానా..!


దిగులుపూల చెట్టులాగ..తనువు కాలిపోతున్నా.. 

ఏమిటొ ఈ ఆనందం..నేను నాకు దొరికానా..! 


కలలతోట ఎక్కడో..పనేముంది అసలింకా.. 

నవ్వుపూల మేఘంలా..ఇపుడు నేను అయ్యానా..! 


నీవు నేను మాయమైన..సాక్ష్యమెలా మిగిలేనో.. 

అక్షరాల వరమాలై..నన్నునేను చేరానా..! 



Rate this content
Log in

Similar telugu poem from Romance