నీవు ఎవ్వరో నేను ఎవ్వరో
నీవు ఎవ్వరో నేను ఎవ్వరో
నీవు ఎవరో నేను ఎవరో మధురకవనం కలుపుతున్నది
ఎవరికెవరో చివరికెవరో కలిపితీరం చేర్చుతున్నది
చూపు శరమై గుచ్చుకున్నది అధరవీధుల విచ్చుకున్నది
మనసు తొడిగిన మేలిముసుగుకు చరమగీతం పాడుతున్నది
రాసిపోతే ప్రేమలేఖలు వాలిపోయే కంటి రెప్పలు
విసుగుచెందిన క్షణము యుగమై హృదయభారం పెరుగుతున్నది
మల్లె పూసిన మత్తు గంధం మనసు రాసిన మరో గ్రంథం
సెగలు రేపిన వలపు వేడికి అగరు ధూపం కరుగుతున్నది
ఓరకంటితొ రాయబారం ఓపలేనని దాని భావం
కలిసి పాడిన యుగళ గీతికి మదన తాపం పెరుగుతున్నది

