నీవే నా ప్రియసఖివని
నీవే నా ప్రియసఖివని
నీవే నా ప్రియసఖివని..చెప్పాలని అనిపించదు..!
నీవుపెట్టు ముద్దగాక..ముట్టాలని అనిపించదు..!
ఎంతమాయ చేసినావొ..ఎలా మదిని దోచినావొ..
నీ తలపుల వెన్నెలగది..వదలాలని అనిపించదు..!
ఏ పని నే చేస్తున్నా..నీ చూపుల సాక్షిగనే..
నీ పాటగ గాకుండా..బ్రతకాలని అనిపించదు..!
గాలికెంత ఆరాటమొ..స్వరములలో చేరేందుకు..
గుండెతడికి ఒకరూపం..ఇవ్వాలని అనిపించదు..!
మొక్కుబడిగ భజనచేయ..లేనస్సలు ఏంచేయను..
ఉన్నదేదొ తెలియదులే..దాచాలని అనిపించదు..!
వలపుతేనె మబ్బునీడ..బందీగా ఇబ్బందే..
తీగతెగిన వీణియలా..మిగలాలని అనిపించదు..!
