నీవే నా హృదయ స్పందన
నీవే నా హృదయ స్పందన
నీకోసం నా గుండెల్లో గుడి కట్టాను
అందులో నీ రూపాన్ని కొలువుంచాను .
నా కనుల వెలుగును దీపంగా మార్చాను
నా మనసును నీకు నివేదించాను ..
అయినా ఇంత అపనమ్మకం ఎందుకు
చిరుజల్లుల తాకిడి తట్టుకోలేక
పువ్వులు నేల రాలినట్టు ..
నీ జ్ఞాపకాల బరువును మోయలేక
నా గుండె లయ తప్పుతుంది
మంచు తాళలేక కోకిల గానం ఆగినట్టు
నీ పిలుపు రాక నా గొంతు మూగపోయింది .
నా మనసులో ఈ భారం
నాలో ఈ మౌన వేదన
నా హృదయం లో ప్రేమ జ్వాల
ఆగేది ఎప్పటికీ ...
నా ప్రేమ ఈ కన్నీటిలో కరిగిపోవాలా
ఈ కవితలలో నిలిచిపోవాలా
కాలగర్భంలో కలిసిపోవాలా
ఉప్పొంగే నాగుండె ఆవేదన నింగిని తాకింది
ఎందుకు చేరడం లేదు నీ హృదయం వరకు
నీవే నా హృదయ స్పందన ..
నీకే నా ప్రాణ నివేదన ..
ఇకనైనా నను వీడిపోని బంధంఅయి
నా వెంట నడవవా
నేను ఉన్నానని నమ్మకాన్ని అందించవా ..
శ్రీ ..
హృదయ స్పందన ..

