STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

నీన్నంటే గత క్షణం

నీన్నంటే గత క్షణం

1 min
9

అనుభవాల తేనియలను.. కురిసి వెళ్ళినావు కదా..!

అందమైన దారేదో..వేసి వెళ్ళినావు కదా..!


నిన్నంటే గత క్షణం..నేడంటే ఈ'క్షణమే..!

జ్ఞాపకాల పూలతోట..నిలిపి వెళ్ళినావు కదా..!


రేపటితో అనుబంధమె..మరుక్షణం అనుక్షణం..!

నీతో నా చెలిమిబాట..చూపి వెళ్ళినావు కదా..!


ఏ క్షణమూ నిను మరువక..స్వాగతింతు మధురముగా..

యుగయుగాల చెలిమి పాట..నేర్పి వెళ్ళినావు కదా..!  


కనురెప్పల కొలువుసాక్షి ..బహు చక్కని చిత్రసీమ..

పెను నిద్దుర నిఘంటువున..దాచి వెళ్ళినావు కదా..!



Rate this content
Log in

Similar telugu poem from Romance