నీలో నేను
నీలో నేను
నీలో... నేను
ఎవ్వరికి కనిపించక ఓ క్షణం,
బిగ్గరగా అరుస్తూ మరో క్షణం.
ప్రశాంతంగా సేద తీరుతూ ఓ మారు,
అలసి పోయి ఏడుస్తున్నట్టు మరో మారు.
బ్రతకడానికి ఊపిరి పీలుస్తూ ఓ నిమిషం,
బంధామై ఒదిగిపోతూ మరో నిమిషం.
ఏమి చేసినా నీ నవ్వులో చేరిపోతాను,
గుండెలో ఇంకి ప్రేమగా మారిపోతాను,
నీ వాడినై నీలో అంతర్ధనామై నీలో మిగిలిపోతాను.
