STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీలి మేఘమా...

నీలి మేఘమా...

1 min
355

నీలి మేఘాలలో గాలి తాళాలతో...........

గళము విప్పే ఆకాశం.............

గాలమేసే అవకాశం.............

నిలువునా తడిసిపో హృదయమా...........

మునకలేస్తున్న ఆనందమా............

జలజలా రాలు జలపాతమా............

మిలమిలా మెరిసే నీటి ముత్యమా............

తడి తడి పుత్తడి భువనమా..............

మొలకలై పులకలై చివురించుమా............

వరుణుని శాసనం ఇది సుమా.............

తలవొంచటం ప్రకృతి నైజమా............

ఉరుములై మెరుపులై నింగి మారిన క్షణం............

విరుపులై ఝలుపులై మబ్బు తనువులే పణం.........

కలగకుండా , కురవకుండా ఉండలేదు మేఘం.........

తడవకుండా , ఆడకుండా ఉండలేదు పాదం...........

చినుకుల్లో గుప్త సప్త స్వరాలు విన్న ప్రాణం............

నిలువలేదు తనువంత వింత పులకరింత అల్లుకునే వైనం.............



Rate this content
Log in

Similar telugu poem from Romance