నీలి కన్నుల నేస్తమా
నీలి కన్నుల నేస్తమా
నీలి కన్నుల నేస్తమా !
నీలి వర్ణపు సాగరపు ఒడ్డున నీలి కన్నులతో
నిరీక్షిస్తున్నావా...!
సాగరపు అలల చాటున నిశ్శబ్దపు యుద్ధం
చేస్తున్నావా...!
చామంతి వర్ణపు దుస్తులతో చల్ల గాలిలో సేద
తీరుతున్నావా...
కరిగిపోతున్న కాలం గురించి తలవక,
బంగారు భవిష్యత్తు గురించి కలలు కంటున్నావా...

