STORYMIRROR

VENKATALAKSHMI N

Action Inspirational Others

4  

VENKATALAKSHMI N

Action Inspirational Others

నీకు నాకు మధ్య..

నీకు నాకు మధ్య..

1 min
381

ఎన్నో కలల్ని

ఎన్నో ఆశల్ని

మదిలో పోగేసుకున్న

మనం

అవన్నీ నిజమయ్యే

తరుణాన

ఈర్ష్యతో ఈసడింపుతో

కాలం కత్తి కట్టిన క్షణాన

మన మధ్య మాటలు

మౌనాన్ని ఆశ్రయించాయి

అపార్థాల నదిలో

మునకలేస్తున్నప్పుడు

అంతా శూన్యమై

నిరాశ నిస్పృహలతో

నీరసించిన మదికి

నీ మౌనం

తుఫానురాక మునుపు

నిశ్శబ్ధాన్ని తలపిస్తుంది

బంధాన్ని సమాధి చేస్తుంది

వున్నట్టుండి ఓ మధుర క్షణాన

నువు విసిరిన చిరునవ్వు బాణం

మన మధ్య అడ్డుగా వున్న

అపార్థాల తెరను తొలగించె

ఆగిన శ్వాసకు ఊపిరి పోసె

దూరాలను చెరిపేసెను

ఇన్నాళ్ళు మౌనం తరువాత

నీ నవ్వు కోటి రాగాలను రవళించె



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Action