నీ ఊసులు...
నీ ఊసులు...
చక్కని పాటలా
చిక్కని పాలలా
మెరిసే మెరుపులా
మెత్తని దూదిలా
కమ్మని కవితలా
చిమ్మే వెలుగులా
కాసే కాయలా
పూసే పువ్వులా
వీచే గాలిలా
కాచే వెన్నెలలా
విరబూసిన నవ్వులా
తొలిచినుకు జల్లులా
నువ్వేంతో ఎక్కువ
నీ మనసెంతో మక్కువ...
నువ్వేచోటవున్నా
పక్కనేవున్నట్టు
నువ్వేంచేస్తున్నా
నన్నే చూస్తున్నట్టు
నీనోట ఏదిపలికినా
నన్నే పిలిచినట్టు
నువ్వెటువెళ్తున్నా
నాదరికే వస్తున్నట్టు
పొద్దంతా ఊహల ఊసులు
సందెంతా ఆశల బాసలు
రేయంతా కలల కల్లోలాలు

