నీ తోడును మౌనం గా
నీ తోడును మౌనం గా
తను తూరుపు..నే పడమర..కలిపిందే ఆకాశం..!
ప్రేమించుట వెర్రితనం..చెప్పిందే ఆకాశం..!
అక్షరాల తననవ్వే..నదిలాగా ప్రవహించెను..
అమృతనిధిని గజలింటికి..పంపిందే ఆకాశం..!
వియోగాగ్ని కడలిలోన..తెరచాపై నా హృదయం..
విరహ వాయులీనమదే..మీటిందే ఆకాశం..!
అందలేని అనురాగం..విషాదాల మధువేగా..
విచిత్రమౌ అనుగ్రహం..ఒలికిందే ఆకాశం..!
కల్పతరువు లాంటి మనసు..కలలతేరులా మారెను..
జన్మమర్మ సాక్షి తనై..నిలిచిందే ఆకాశం..!
నీ చెలిమియె భాగ్యమైన..గంధములే మనసా..
నీ తోడును మౌనముగా..ఇచ్చిందే ఆకాశం..!

