STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ సొగసులు

నీ సొగసులు

1 min
293

పాలరాతికేమి తెలుసు..నీసొగసులు..చూపడం..! 

సన్నాయికేమి తెలుసు..నీ ప్రేమను పాడడం..! 


దూకేనా కొండలెన్నొ..గలంగలలు సృష్టిస్తూ..

సెలయేటికేమి తెలుసు..నీ నవ్వులు పొగడడం..! 


తేనెలను గ్రోలునేమొ..పూలయెదల పైవాలి.. 

ఏ తేటికేమి తెలుసు..చెలిమిమధువు పంచడం..! 


తుఫానులో గంధాలో..అతీతముగ సాగునే..

ఈ గాలికేమి తెలుసు..చెలునిసేద తీర్చడం..! 


నిచ్చెనతో పనేముంది..గగనాలను దాటగా.. 

ఏ దారికేమి తెలుసు..నీ సన్నిధి చేర్చడం..! 


ఎంతపదును చూపునీది..మెఱుపులకే మెలకువా.. 

ఏ కత్తికేమి తెలుసు..ఈ గుండెను కోయడం..! 


Rate this content
Log in

Similar telugu poem from Romance