STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

నీ శ్వాస

నీ శ్వాస

1 min
4

పరిమళించు గాలులేవి..పాడకుండ ఉంటాయట..!

వెలుగుతేనె చినుకులేవి..అందకుండ ఉంటాయట..!


అక్షరాల మౌనమసలు..వినేందుకు తీరికేది..

అంతరంగ జలధులేవి..ఇగరకుండ ఉంటాయట..!


స్వప్నించే మేఘాలా..ఉన్నవిగా కన్నులింట..

నిదురించే వలపులేవి..మరగకుండ ఉంటాయట..!


చూచుతీరు తెలియకనే..విహరించే ముచ్చట కద..

విరహపుగది తలుపులేవి విరగకుండ ఉంటాయట..!


చంచలమౌ చలమ కాదు..మనసన్నది గమనిస్తే..

ఊరుతున్న ఊసులేవి..నిలువకుండ ఉంటాయట..!



Rate this content
Log in

Similar telugu poem from Romance