నీ రూపమే ❤️❤️❤️
నీ రూపమే ❤️❤️❤️
నా కళ్ళలో కాన వచ్చే ప్రతీ రూపం నీ రూపమే
నా నవ్వులో రాలే ప్రతి ముత్యం నీ రూపమే
నా చేతి నుంచి జాలువారే ప్రతి అక్షరం నీ రూపమే
నా అడుగులలో వచ్చే ప్రతి పాద ముద్ర నీ రూపమే
నా మదిలో వికసించే ఊసులన్నీ నీ రూపమే
నా యదలో జనించే తరంగాలన్నీ నీ రూపమే
అను క్షణం నా వెంట ఉండే నీడ కూడా నీ రూపమే!!