నీ రాధను నేను
నీ రాధను నేను
కోటి సూర్యుల కాంతి రేఖలా మదిలోకి వచ్చి
హృదయ రాగాలను శృతి చేసి వలపు రాగాలు మీటావు.
సప్తస్వరాలను జతచేసి నా కనుల మూగ భాషతో
రసరమ్య భావాలను పలికించావు.
స్వరఝతులను తాళాలుగా మార్చి తనువును మయూరంచేశావు.
రవి వర్మ కుంచెతో నా తెల్లని మనోఫలకం మీద ఎన్నో వేల
అనురాగాల కళాఖండాలను చిత్రించావు.
సప్తవర్ణాల హరివిల్లుతో అద్భుతవర్ణాల సుమమయం చేసావు
మన కలియకను ఆ రవి చంద్రులు ఉన్నంతవరకు
మన కలయికను అపురూపంగా చూసుకుంటాను.
సృష్టిలోని నా ప్రాణ వాయువు స్తంభించే వరకు
మదిలో పదిలంగా నిన్ను నాలో నిలుపుకుంటాను.
నీ రాధను నేనే... నా మదిలోని కృష్ణుడవు నీవే...

