నీ ప్రయాణం
నీ ప్రయాణం
చెదిరిపోయిన కలను,
కరిగిపోయిన వ్యధను,
చెరిగిపోయిన జ్ఞాపకాన్ని,
కాలమనే దారిలో తప్పిపోయాను,
ఊపిరి ఉన్నా జీవోత్సవాన్ని,
ఆగిపోయిన కథను,
అల్లుకోలేని ఆశను,
చేరుకోలేని దూరాన్ని,
చెక్కుచెదిరిపోయిన శిల్పాన్ని,
మాటలు వచ్చిన మగవాడిని,
సంతోషంతో నవ్వి ఆప్పుడే ఏడ్చే మనస్సును,
ఎముకల గూడు దేహాన్ని,
అందరున్నా ఒంటరిని,
ఆలోచిస్తే శూన్యం,
ఏం లేదు జీవితం,
ఎలా వచ్చావో అలానే నీ ప్రయాణం,

