నీ ప్రేమజల్లుల్లో
నీ ప్రేమజల్లుల్లో
ఎన్నడూ నవ్వని పెదవులు
నవ్వుతున్నాయి
నిన్ను చూసాకనే ...........
ఎపుడూ కలలు కనని కనులు
కలలు కనడం నేర్చాయి
నిన్ను తలచాకనే ..............
ఎపుడూ వినని మధురమైన పాట ఏదో
చెవిని సోకింది
నీరాక చిరుగాలి తెలుపగనే........
మలయ మారుతమై వస్తావు
మెల్లగా మదిని మీటుతావు......
వాసంత సమీరమై వస్తావు
వలపుల వాన కురిపిస్తావు......
హేమంత తుషారమై వస్తావు
నీ ప్రేమజల్లుల్లో నిలువెల్లా తడిపేస్తావు.
ఆరాధన గీతమై వస్తావు
మనసును ఆసాంతం నీలో
లీనం చేసుకుంటావు...

