నీ పాటకు ఊపిరి గా
నీ పాటకు ఊపిరి గా
నీ పాటకు ఊపిరిగా..జీవిస్తే చాలు..!
జ్ఞాపకాల తేనెపట్టు..వదిలిస్తే చాలు..!
ఎలా చెబితె అందేనట..అసలుప్రేమ గుట్టు..
మరణాన్ని చిలక్కొయ్యకి..తగిలిస్తే చాలు..!
మాటలెన్ని అపార్థాలు..ఇస్తాయో చూడు..
మౌన గంధమింత సరిగ..పట్టిస్తే చాలు..!
మరి నచ్చని తనముగాక..శత్రువెవరు లేరు..
సర్దుకునే ముచ్చటనే..సాధిస్తే చాలు..!
చెలిమిగాక సంపదసలు..ఉందేమిటి మనకు..
ప్రాణానికి ప్రాణంగా..మనసిస్తే చాలు..!
గిరిగీసుకు నరకాన్నే..స్వర్గమనే వేమి..
కులమతాల ఇంటికి నిప్పంటిస్తే చాలు..!

