నీ నవ్వుల గంధం
నీ నవ్వుల గంధం
ఈ కలయిక కలకాదని..చెబుతావా ఒక్కసారి..!
గుండెలయల ఆవేదన.. వింటావా ఒక్కసారి..!
వలపుతేనె వానమబ్బు..ఆగడాలు మానేనా..
నీ చూపుల పూలగొడుగు..పడతావా ఒక్కసారి..!
నీ అడుగుల జాడలనే..ముద్దాడే ముచ్చట కద..
నువు నడిచిన దారిని చూపెడతావా ఒక్కసారి..!
అక్షరాల చిరునామా మాయమైన ప్రమాదమే..
నీ మౌనం వంతెనగా.. చేస్తావా ఒక్కసారి..!
పంచభూత సాక్షి కదా..పాంచభౌతిక వాస్తవం..
నీ నవ్వుల గంధమింత..రాస్తావా ఒక్కసారి..!

