STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ నవ్వుల దీపాలే

నీ నవ్వుల దీపాలే

1 min
255

నా కన్నుల ప్రమిదలలో..నీ నవ్వుల దీపాలే..! గుండెలయల సవ్వడిలో..నీ ముద్దుల దీపాలే..! 

ఎంతల్లరి చేస్తావో..ఏంచెప్పను మాటలలో..ఈ మనస్సు కోవెలలో..నీ వలపుల దీపాలే..!

గొడవలన్ని మాన్పించే..చూపంటే నీదేలే.. నా ఆశల మేడలోన..నీ తలపుల దీపాలే..! 

దీపావళి పండుగంటె..వేరేగా ఉందేమిటి.. నా తనువున అనుక్షణం..నీ మెఱుపుల దీపాలే..! 

నీ పాటల చెట్టుమీది..ఓ కోకిల నేనేనా.. నా మౌనపు వెన్నెలలో..నీ పదముల దీపాలే..! 


Rate this content
Log in

Similar telugu poem from Romance