STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ నవ్వే...

నీ నవ్వే...

1 min
213

నీ అందమైన నవ్వు

అపుడే విరిసిన సిరిమల్లె పువ్వు

తూర్పున వికసించిన మందార పువ్వు

కొలనులో విచ్చిన తామరపువ్వు


నువు నవ్వితే చాలు

ఎన్ని నవరత్నాలు నేల రాయాయో

అవి ఒడిసి పట్టాలంటే

 ఒక దోసిలి సరిపోవునా


నువు నవ్వితే చాలు

 ఎన్ని పూలు మొగ్గముడిచాయో

ఆ మొగ్గలను లెక్కించ

 ఈ జన్మ సరిపోవునా


నువు నవ్వితే చాలు

 ఎన్ని చుక్కలు మబ్బులో దాగాయో

 మళ్లీ ఆచుక్కల వెలుగులు చూడ

అమవస రేయి సరిపోవునా


Rate this content
Log in

Similar telugu poem from Romance