నీ మనసు
నీ మనసు
నీ మనసులోని మాట విని మైమరిచిపోయాను మమతానురాగాల వాకిట నిలిచి ఉన్నాను..
కలిసిపోవాలని కలలు కంటున్నాను కాటుక దిద్దిన కనులు వేచి చూస్తున్నాయి..
మదిలో వెయ్యి కొవ్వొత్తులు వెలిగినాయి.కాటుక కరిగిపోతుందేమో అని,
కొవ్వొత్తులు కరిగిపోతాయేమో అని,నాలో కలుగుతున్న అలజడికి అంతం లేదా
వేచి ఉన్న కాటుక కనులు నిదురలోకి జారెను నిదురించిన కనులలో కలవై వచ్చావు..
బిగి కౌగిలిలో నన్ను బందించావునిన్ను చూడాలని ఆరాటపడిన నా కనులు తెలియకుండానే విచ్చుకున్నాయి..
కాటుక కనులపై ముద్దాడి కనుమరుగయ్యావు కలలోనైనా కలిసుంటావంటే, శాశ్వతంగా నిదురిస్తాను..

