నీ మనసేమో
నీ మనసేమో
నీ మనసేమో నాది అంట
నా తలపేమో నీది అంటా
నీ పెదవితోటే నేను నవ్వుతుంటా
నీ కనులేమో నావి అంట
నా కలలేమో నీవి అంట
నీ ఊహలతోనే నే బతుకుతుంటా
అందమంతా నాది అంట
ఆశలేవో నీవి అంటా
చిరునవ్వు నాది అంట
చిరు అలక నీది అంట
నిను చేరదీసి గుండెలో దాచుకుంటా
కొమ్మచివర పూసిన పూలు తెచ్చి
నీ చేతులతో మాల కట్టి
నా జడ లోతురుముతుంటే
నాకు ఎంతో సంబరమంటా

