నీ మౌనం..
నీ మౌనం..
నీ మౌనం నన్నెంతగా వేధించినా
నీ ప్రశాంతత కోసమే పరితపిస్తున్నా
నీ దూరం మనసును బాధించినా
నీ ఆనందం కోసమే ఏదరికో కొట్టుకుపోతున్నా
జరిగిపోయిని గతాలు నీడలా వెంటాడుతున్నా
తిరిగిరాని జ్ఞాపకాలను మరువలేక పోగేసుకుంటున్నా
పువ్వులా నవ్వుతుంది ముల్లులా గుచ్చుకుంటుంది...
మువ్వలా మోగుతుంది గువ్వలా ఎగురుతుంది...
మౌనమై మిగులుతుంది అదే జీవితం...
వెలుగు కూడా నన్ను తాకి చీకటై పోతుంటే
మనసు మాత్రం తారాతీరంలో విహరిస్తోంది
ముసుగు కప్పి జీవనం గడిపేస్తూ వుంటే
మమత తగిలి ఆశాపాశం అంటూ ఊహల్లో తేలుతోంది...
... సిరి ✍️❤️

