నీ మౌన గగనమే
నీ మౌన గగనమే
దీపాల వాడయే..సంద్రమై పొంగింది..!
నీమౌన గగనమే..కావ్యమై మిగిలింది..!
నవరాగ భావాల..మాధురియె నాచెలియ..
నిజపవన వీచికల..గంధమై దక్కింది..!
సరసాల వీధుల్లొ..గమకాల రాశియే..
సంసార వీణియకు..ప్రాణమై చేరింది..!
పగడాల చిత్తరువు..సాక్షిగా తా'నేను..
ఊహలే పండించు..మేఘమై ఉరికింది..!
హరివిల్లు వర్ణాల..భోగాంతరంగిణియె..
ప్రేయసిగ ఎదలోన..చిత్రమై విరిసింది..!
మరపన్నదే లేని..లోకాన మైమరపు..
జ్ఞాపకాలను రాల్చు..జ్ఞానమై ఒదిగింది..!

