నీ కన్నుల కలల
నీ కన్నుల కలల
నీ చిలిపి చూపులు
విరి బాణాలౌతుంటే..!!
నీ వలపుపిలుపు
వెన్నెల సోయగమౌతుంటే..!!
నీ కన్నులు కలల
కౌగిలై నన్ను దాచుకుంటుంటే..!!
నీ తీయని పిలుపులు
కోయిల గానమౌతుంటే..!!
మన ఇరువురి దేహాలు
పెనవేసిన మల్లె తీగలౌతుంటే..!!
మనఊహల ఊసులు
"తొలకరి చినుకులపూలై" రాలుతూ
హృదయాలనుమెత్తగా తాకుతుంటే ..!!
మనసంతా మధురిమల
మల్లెల వాసంత సమీరమేగా...!!

