నీ జ్ఞాపకాలు
నీ జ్ఞాపకాలు
కంటికి వెలుగే నీరూపనుకుంటే
కన్నీటి తిమిరాన తోసేసావు..
మదికి మరులే నీవలపనుకుంటే
శూన్యంలో మౌనమై మిగిల్చావు..
జీవితమంటే నీతో గడిపిన కాలమేననుకుంటే
భవిష్యత్తే నిర్జీవం చేసేసావు
నీజ్ఞాపకాల నీడలో నిదురిద్దామంటే
కునుకు దరిచేరని జాగారమే బహుమతిచ్చావు
లేదా మనసుకు శాంతి రాదా నాకిక కాంతి

