నీ జాడ
నీ జాడ
ఎంతకూ ఈ దారి చూపదే నీ జాడ..!?
ఏమిటో చిత్రంగ దొరకదే నీ జాడ..!?
తప్పేమి చేసాను..ప్రేమించి నందుకా..?!
ఎందుకో కావ్యమై..అందదే నీ జాడ..?!
నిప్పారిపోయాక..ఏంచేసి వెళతావు..!?
ఆశనే తీర్చగా..మిగలదే నీ జాడ..!?
వెన్నెల్ల వీణగా..నిను తలచినానేల..!?
విరహాలు కాల్చేయ..వెలుగదే నీ జాడ..!?
సంక్రాంతి కానుకై..అలరించ జాగేల..
ఈ ఎదురు చూపేల..చిక్కదే నీ జాడ..!?

