STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

నీ ఎదుటే

నీ ఎదుటే

1 min
3


రాచిలుకై నామనస్సు..వాలెనుగా నీ ఎదుటే.! 

మయూరమై నాహృదయం..నిలచెనుగా నీ ఎదుటే.!


ఈ మలగని కన్నులతో..అల్లరింక ఓపుటెలా..

యవ్వనమే వసంతమై..విరిసెనుగా నీ ఎదుటే..!


సిగ్గుపడే సింధూరపు..చెక్కిలింటి సొగసు చూడు.. 

సోయగాల రసజగమై..పొంగెనుగా నీ ఎదుటే..!


నీవు లేని ఈ వేళన..మేలమాడు తనువిదుగో.. 

నీ చెలిమికి నైవేద్యం..పెట్టెనుగా నీ ఎదుటే..!


ఎందుకటా దొంగాటలు..నాటకాన నాటకమా..

మౌనముగా నా పరువం..నవ్వెనుగా నీ ఎదుటే..!



Rate this content
Log in

Similar telugu poem from Romance